పలక (బాలగేయం); - -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
అయ్య తెచ్చిన పలక
అందమైనది పలక
అక్షరాలు వ్రాసే
అద్భుతమైన పలక

ఓనమాలు దిద్దే
ఘన సాధనం పలక
విద్యార్థులకిష్టం
వారి నేస్తం పలక

రూపమేమో నల్లన
అక్షరాలు తెల్లన
త్యాగమూర్తే పలక
భవిత చూపే పలక

పలక,బలపం జోడు
వాటి స్నేహం చూడు
విద్యార్థి దశలోన
కీలకమైన పలక


కామెంట్‌లు