ఋషులు.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 భృగు మహర్షి.
బ్రహ్మ యొక్క హృదయము నుండి పుట్టిన నవబ్రహ్మలలో బృగు మహర్షి ఒకరు. ఈయన వంశములో చ్యవన మహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దధీచి, పరశురాముడు వంటి గొప్పవారు ఎందరో జన్మించారు. శ్రీ మహావిష్ణువును మానవుడిగా జన్మించేలా శపించినవాడు భృగు మహర్షి యే. కారణం శ్రీ మహావిష్ణువు బృగువు యొక్క భార్యను సంహరించిన సందర్భంలో భృగువు విష్ణువును శపించాడు. అలా అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు గాథలే నేడు పురాణాలైనాయి.", మోక్షప్రదాత"ఎవరు అని నిర్ణయం చేసిన వారు కూడా భృగు మహర్షి యే. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించి శ్రీ మహా విష్ణువే మోక్ష ప్రదాత అని తేల్చిన ఘనత భృగు మహర్షిది. ఈయనకు ఖ్యాతి,ఉశన, పులోమా అనే భార్యలు ఉన్నారు.
భరద్వాజమహర్షి:
భరద్వాజుడు పూర్వకాలంలో విమానం తయారీ వంటి ఎన్నో సైన్సు విషయాలను సృష్టించిన గొప్ప మహర్షి. ఈయన పరమా శాంతమూర్తి."బృహస్పతి"వలన పుట్టిన వాడు భరద్వాజుడు. జననం అయినా వెంటనే మరుద్గణాలు తీసుకువెళ్లి భరద్వాజని పెంచాయి. భరద్వాజడికి"ఘ్రుతాచి "అనే అప్సరస మీద మొహం వలన ఉద్భవించినవాడు ద్రోణాచార్యులు. భృగు మహర్షి ద్వారా భరద్వాజుడు జ్యోతిష్య శాస్త్రం, వర్ణాశ్రమ ధర్మాలు తెలుసుకున్నాడు. రావణావధ అనంతరం శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజోడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చినట్లుగా హరివంశంలో చెప్పబడింది.

కామెంట్‌లు