గుసగుసలాడే నిశ్శబ్దం
లోయలలో ప్రతిధ్వనిస్తుంటే
ఏటినీటితో సరసమాడి
వీస్తున్న మలయమారుతం
మొక్కల తరువుల శాఖలను
ప్రేమగా తలనిమిరి
ఆప్తబంధువులా
ఆదరించి ఆవరించిన కొండగాలి
పచ్చలు పొదిగిన కనుమల
అందం చూసి వెలుగే
మైమరచి ఇలకు దిగివచ్చి
అవని మొత్తం ఆవరించిన వైనం.
ప్రకృతి అందానికి
రక్షణగా నిలచినట్టున్న
కొండ శిలలు
వలయంగా కాపుకాసిన
గిరి శిఖరాలు
కిరణాల దూకుడుకు
విరిసిన ౮ముద్దబంతి పువ్వులా
ముగ్ధమోహనంగా నవ్వుతూ
సిగ్గులమొగ్గైన పూలమడులు
ఎన్నడూ ఊహించని కలలా
ఎదుటే సాక్షాత్కరించిన అందం
మబ్బుల పందిరి కింద
మనోహరమైన దృశ్యం
కలవని తీరాల కలలు
నిజమై..కిరణాల వంతెన
కలిపిన వేడుక
కనుల విందై కనిపించగా
శుభసంకేతంలా మనసుకు
ఆనందం ఇచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి