నా బాల్యం
నాకు కావలి
ఆనాటి స్నేహితులు
ఈనాడు కావాలి
అప్పటి ఆటలు
ఇప్పుడు ఆడుకోవాలి
ఆరోజుల ముచ్చట్లు
ఈరోజున చెప్పుకోవాలి
అనురాగాల అన్నతో
ఆప్యాయతను పంచుకోవాలి
చిట్టి చెల్లిలిని
చిరునవ్వులలో ముంచాలి
చెరువులో దిగాలి
ఈతనుకొట్టాలి
చెట్లనెక్కాలి
కాయలుకోయాలి
పూలనుకొయ్యాలి
పరమాత్మునిపూజించాలి
అమ్మప్రేమను
పొందాలి
నాన్నతో ముద్దులను
పెట్టించుకోవాలి
అందరితో అమాయకంగా
ఆడాలి పాడాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి