@పొతే... తిరిగిరావుకదా..!- కోరాడ నరసింహా రావు
ఎంత సమ్మోహన పారవశ్యం లో నైనా.... 
ఏమరపాటు, మర పురాని జీవితాంత 
దుఃఖమై, వే దించి బాధిస్తూనే ఉంటుంది..!
   
పనిలో ఏకాగ్రత ప్రశంస నీయ
మే...ఆ ఏకాగ్రతతో ప్రపంచాన్నే మరచిపోవటమా.... !! 

నిండు జీవితాన్ని జీవించ వల సిన 
పసి ప్రాణాన్ని లెక్కచెయ్య నంత గొప్పదా ఆ ఛాటింగ్....?!

అది కేవలం ఒక వినిమయ వస్తువు మాత్రమే...., 

వస్తువుల  కన్నా...విలువ లేనివి కావుకదా
మనుషుల ప్రాణాలు... !!

వాటినెప్పుడైనా వాడుకోవచ్చు 
ప్రాణాలు పొతే తిరిగి రావు కదా.... !
      ******
కామెంట్‌లు