శివా కి తొలిసారిగా ఉద్యోగం బెంగళూరు లో వచ్చింది. అమ్మని వదిలి వెళ్లటం ఇష్టంలేదు. కానీ తప్పదు.అమ్మ ఆస్త్మా పేషెంట్. "నాయనా!నీవు బి.టెక్.మంచి మార్కులతో పాసైనా ఎం.ఎస్.కి పంపలేకపోయాను.జాబ్ ముఖ్యం" అని బలవంతంగా పంపింది. ఒక స్నేహితుడి రూం లో దిగాడు. హైదరాబాద్ లో అమ్మకి అంతా స్నేహితులు బంధువులు ఉన్నారు. నాన్న పెన్షన్ విడో పెన్షన్ తోఇల్లు గడిపింది. తల్లి పుట్టిన రోజు ఎల్లుండి అని గుర్తుకొచ్చిన శివా చీర కొంటానికి డబ్బు లేక చిన్న పాలకోవా పాకెట్ కొని అమ్మకి పంపాలనుకున్నాడు.అక్కడ వాచ్మన్ మేనల్లుడు 15ఏళ్ల వాడు కనపడ్డాడు."సార్!అమ్మకి జ్వరంగా ఉంది. కొంచెం డబ్బు సాయం చేయరా?" దీనంగా అడుగుతున్నాడు.ఆమందు చీటీ తీసుకుని శివా వెళ్లి స్వయంగా మందులు కొనిఇడ్లీ పొట్లం తో వాచ్మన్ గదిదగ్గర ఆగాడు. "ఇవాళ మాఅమ్మ పుట్టిన రోజు. అమ్మ కి చీర కొని పంపాలనుకున్నాను.నీచెల్లికి జ్వరం అని మందులు కొన్నాను.నీమేనల్లుడు చెప్పాడు" వాచ్మన్ అన్నాడు "అవును సార్! పదేళ్ల బట్టి మా అక్కయే తన పెద్ద కొడుకు గా చూస్తాఉంది."అని కన్నీరు పెట్టాడు వాచ్మన్. ఇదే నిజమైన బహుమతి కదూ🌹
బహుమతి!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి