సమాజాన్ని
సూటిగా
ప్రశ్నిస్తున్నా!
బ్రతకటానికి
ఉద్యోగాలివ్వని
చదువులెందుకు?
అన్యాయాలకుబలయినవారిని
ఆదుకోలేని
న్యాయస్థానలెందుకు?
ప్రజలసంక్షేమాన్ని
పట్టించుకోని
ప్రభుత్వాలెందుకు?
దొంగలను
పట్టుకోలేని
రక్షకవ్యవస్థయెందుకు?
సంతానాన్ని
సరిగాచూడని
అమ్మానాన్నలెందుకు?
వృద్ధ తల్లితండ్రుల
చూడని
తనయులెందుకు?
ఆప్యాయతలు
సఖ్యతలులేని
కుటుంబాలెందుకు?
సుఖసంతోషాలు
కరువైన
సమాజమెందుకు?
గమ్యము
చేరలేని
జీవితపయనాలెందుకు?
సాయం
చేయని
చేతులెందుకు?
కమ్మని
కవితలు వ్రాయని
కవులెందుకు?
సమాజమా
స్పందించు
సరిదిద్దువ్యవస్థలను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి