చిత్రానికి పద్యం ; - సాహితీసింధు సరళగున్నాల

  ఉ*తప్పులెరుంగబోరు ,తమ తప్పని జెప్పిననొప్పుకోరు నే
గొప్పల తిప్పలున్ బడక కూరిమి తోడచరించు, చెప్పెడిన్
మెప్పులకోసమై నురుకు మేటిగ నాటల యందు ,నెవ్వరున్
నొప్పిన నొప్పకున్న సరియుండెడి స్నేహము కోరుబాలికల్
కామెంట్‌లు