కళా తపస్వి;- చంద్రకళ యలమర్తి
వాగర్ధావివ సంపృక్తౌ  వాగర్ధ ప్రతి పత్తయే అని కాళి దాసు పద్యాలు మనకు పరిచయం చేసాడు

సంగీత,సాహిత్య సమలంకృతి
అయిన సరస్వతీ దేవి ప్రియ పుత్రుడు అతడు

సంగీతానికి, నాట్యానికి తన చిత్రాల్లో పెద్దపీట వేసి వాటికి తిరిగి గత వైభవాన్ని తెచ్చిన విశిష్టమైన వ్యక్తి అతడు 

ప్రేక్షకుల అణువణువునా
వేద నాదాలను మోగించాడు
సిరిసిరి మువ్వల సవ్వడిలో
జనాన్ని వోలలాడించాడు

ఝమ్మంది నాదమంటూ మూగ మనస్సులో ఆనందాన్ని నింపాడు 
చిత్రసీమకు అద్భుత మైన స్వర్ణ కమలాన్నందించాడు 

రంగుల సినీ ప్రపంచమాయలో పడకుండా సినీరంగానికి ఉన్నత విలువనేర్పిమార్గదర్శకుడయ్యాడు 

స్వయం కృషితో సాగరసం
గమాన్ని నిర్మించి తానొక స్వాతి ముత్యమయ్యాడు 

అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించి కళామతల్లి సేవలో పునీతుడయ్యాడు

శాశ్వతంగా భువిని విడచి దివి కేగిన కళాతపస్వికి కన్నీటి నీరాజనాలు 🙏💐 

***


కామెంట్‌లు