గాయని వాణీజయరాం స్మృత్యర్థం....;- యామిజాల జగదీశ్
 ఆమె గురించి తమిళ సినీ కవిచక్రవర్తి కణ్ణదాసన్ ఎన్నడో చెప్పిన మాటలివి....
కొందరిని చూసినప్పుడు మనకు తెలియకుండానే ఓ "పాశం" ఏర్పడుతుంది. 
ఫలానా అని చెప్పలేని ఆ "పాశానికి" భగవంతుడు తప్ప మరెవరూ కారణం చెప్పలేరు. ఎక్కువ పరిచయం ఉండకపోవచ్చు. రెండు మాటలు మించీ మాట్లాడి ఉండము. కానీ వారు మంచివారు, ఉన్నతులు అంటూ ఓ అభిప్రాయం ఏర్పడుతుంది.
చెప్పాలంటే ఆ అభిప్రాయం
సరిగ్గానూ ఉండొచ్చు. 
కొందరితో మళ్ళీ మళ్ళీ మెలగినా వారి గురించి ఎలాంటి అనుభూతీ మనలో కలగదు. నేను ఎంతో అపూర్వంగా అరుదుగా కలిసేవారిలో ఒకరు వాణీజయరాం.
రికార్డింగుకి వెళ్తేనే ఆమెను నేను కలిసేవాడిని. కానీ పాటల రికార్డింగుకి నేనెక్కువగా వెళ్ళేవాడిని కాను. అయితే అనుకోకుండా ఆ రోజు ఓ స్టూడియోలో నేను వాణీజయరాంని చూసాను. 
"భారతదేశంలోని అన్ని భాషలలో పాటలు పాడారు అనే ప్రత్యేకతను పొందిన వాణీజయరాం అణకువకు మరోపేరు. ఆమెను చూసిన వారెవరైనా కావచ్చు...వెంటనే ఇలా అనుకుంటారు మనసులో.... మన కుటుంబంలో అంతటి వినయశీలి ఉండాలని! నావరకైతే అత్యంత సాన్నిహిత్యం కలిగిన బంధమే గుర్తుకొస్తుంది ఆమెను చూసినప్పుడు. పదేళ్ళ క్రితం తొలిసారిగా కలిసినప్పుడు ఈ అభిప్రాయమే కలిగింది. దీనిని పూర్వజన్మబంధం అంటారు!"
- కణ్ణదాసన్ తమిళానికి అనుసృజన 


కామెంట్‌లు