శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 అధి+అక్ష కలిసి అధ్యక్ష ఐంది. అధి అంటే శ్రేష్ఠం.అక్ష అంటే చూడటం! అందరినీ చూసేవాడు అని అర్ధం. పరమాత్మ ప్రకృతిని చూస్తూ ఉంటాడు.అధ్యక్షుడు అంతే!సభాపతి ఛైర్మన్ ప్రెసిడెంట్  అంటేసంస్థ సభకి ముఖ్య వ్యక్తి అని అర్ధం. సమయపాలన గావిస్తాడు.
అధిష్ఠాత అంటే ముఖ్య వ్యక్తి  అధ్యక్షుడు ఈశ్వరుడు అని అర్ధం. ఆంగ్లంలో డీన్ అంటున్నారు. అసలు డీన్ అంటే బిషప్ ఆధీనంలో ఉన్న అధికారి అని అర్ధం. ఆంగ్లంలో సూపరింటెండెంట్ కి సమానార్ధక పదం అధీక్షకుడు.ఆఫీసులో ప్రధాన అధికారి.
అను అంటే తర్వాత  వాద్ అంటే చెప్పుట!తిరిగి చెప్పటం అని అర్ధం. ఏదైనా భాష లో  ఒకేమాటని విభిన్న విధాలుగా చెప్పటంని అనువాదం  అంటారు. కానీ ఇప్పుడు అనువాదం  అంటే ట్రాన్స్ లేషన్! ఒకభాష నుంచి ఇంకో భాష లోకి తర్జుమా చేయడం అనే అర్ధం లో వాడుతున్నాము.ప్రాచీన కాలంలో తర్కశాస్త్రంలోఏదైనా పదాన్ని మాటిమాటికీ ప్రత్యక్ష ప్రమాణాలద్వారా చెప్పటం రిపీట్ చేయడంని అనువాదం అనేవారు. దీన్ని తర్జుమా అంటున్నారు. 🌷

కామెంట్‌లు