మరక పద గేయం;--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
బట్టలకంటిన మరక
ఉతికితే పోతుంది
బ్రతుకులో పడిన మరక
అలా,ఎలా పోతుంది?

మరక వలన నష్టమే
చెరువు కొనుట కష్టమే
అవమానం కొనితెచ్చును
అపకీర్తి ఆపాదించును

మరక లేని జీవితం
లోకంలో సాధ్యమా?
గెలిచిన మహనీయులను
ఒకరినైనా కానమా?

దిద్దుకున్న గొప్పదనం
కాగలరు పుణ్య పురుషులు
లోటుపాట్లు సహజమే!
మరక పోతే మహా ఋషులు


కామెంట్‌లు