సుప్రభాత కవిత ; -బృంద
అందమైన ప్రకృతికి
సమానమైన అందం
లోకంలో వుంటుందా?

కొలువులో నిలుచున్న
తీరున శిఖరాల  గంభీరం

పచ్చని మరకతాల
కంబళి పరచినట్టు
మొలిచి విచ్చిన పచ్చిక

అందరి అవసరాలూ తీర్చే
అమ్మలా పరుగుతీసే
ప్రవాహపు జోరు

నీడకోసం పెద్దగా 
శాఖలను సారించి
చేతులు చాచి పిలిచే చెట్లూ

హరివిల్లును మించిపోవు
అందమైన రంగుల రకరకాల
సుందర కోమల కుసుమాలు

జిలిబిలి సవ్వడులు చేసి
స్వేచ్ఛగా తిరుగుతూ తమదే
ఆనందం అనుకునే పక్షులు 

పుడమిపై అందాలు
సాగిపోతూ దర్శించి ఆనందంగా
వర్షించే పాలమబ్బులు

చూసిన కొద్దీ చూడాలనిపించే
భువన సౌందర్యం
అహోఁ..సంతసమున మది
అయినది పురివిప్పిన మయూరం

జగతిని క్షేమంగా రక్షించే
ప్రభువుకు  చేద్దాం  వందనం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు