ఏ అక్షర గేయం; - -గద్వాల సోమన్న
ఏ నుగు ఎంతో పెద్దది
ఏ క భావమే మంచిది
ఏ రు నీరు ఉపయోగము
ఏ డ్పు ముఖమే వికారము

ఏ కాగ్రత  ఉండాలోయ్!
ఏ కధాటిగా చదవాలోయ్!
ఏ మి వచ్చినా భయపడక
ఏ లిక వెంట నడవాలోయ్!
 
ఏ మరుపాటుగా ఉండొద్దు
ఏ కాంతమే కడు ముద్దు
ఏ కలవ్యుడు విలుకాడు
ఏ క దృష్టి కలవాడు

ఏ రువాక పర్వదినము
ఏ కాదశి శుభదినము
ఏ క తాటిపై నడిచి
ఏ కీభవించుట  ఘనము


కామెంట్‌లు