న్యాయాలు-49
క్షీర నీర న్యాయము
******
క్షీరము అంటే పాలు.నీరము అంటే నీళ్ళు.
పాలూ నీళ్ళలా కలిసి మెలిసి ఉండే వాళ్ళను, ఒకరికొకరు స్నేహంగా ఉంటూ త్యాగం చేయడానికి వెనుకాడని బంధాన్ని ఉద్దేశించి ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
పాలలో నీళ్ళు కలిపినా పాలరంగు మారదు.పాలలాగే ఉంటాయి. ఆరోగ్యానికి మరీ చిక్కటి పాలు కాకుండా అందులో నీళ్ళు కలిపి తాగితేనే మంచిది అంటుంటారు.
మరి పాలూ నీళ్ళ స్నేహం.అవి ఒకదాని కోసం ఒకటి చేసుకునే త్యాగం, నిజమైన స్నేహం గురించి భర్తృహరి సుభాషితాల్లో ఎంత చక్కగా రాశారు.దానిని తెనిగించి రాసిన ఏనుగు లక్ష్మణ కవి ఉత్పల మాల పద్యాన్ని చూద్దాం.
"క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్/ క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు,దు/ ర్వార సుహృద్విపత్తి గని వహ్ని జొరంజనె దుగ్ధమంతలో/ నీరము గూడ శాంతమగు నిల్ఛు మహాత్ముల మైత్రి యీ గతిన్".
ఈ పద్యం యొక్క భావం పాలు మొదట తనతో కలిసిన నీళ్ళను తనలో ఆత్మీయంగా కలుపుకుని నీళ్ళకు తన రంగు, గుణాలను ఇచ్చి పాలలా మార్చేసింది. అంటే పాలలో ఎన్ని నీళ్ళు కలిపినా నీళ్ళు పాలలాగే ఉండటం మనం గమనించవచ్చు.
తనకు ఇచ్చిన గుణాలకు కృతజ్ఞతగా నీళ్ళు ఏం చేశాయో చూద్దాం. స్నేహితుడైన పాలు వేడవుతూ ఉంటే చూడలేక బాధ పడిన నీరు తాను ఆవిరిగా మారిపోతూ పాలను ఇంకి పోకుండా చూసిందట.
పాలలో ఎన్ని నీళ్ళు కలిపినా బాగా వేడి చేస్తే చివరికి అసలైన చిక్కటి పాలే మిగలడం మనం గమనించవచ్చు.
ఆ సమయంలో తన నేస్తమయిన నీళ్ళు ఆవిరైపోవడం భరించలేని పాలు ఒక్కసారిగా పొంగి బయట పడుతుంటాయట.అది చూసి పొంగుతున్న పాలపై నీళ్ళు చల్లుతుంటాం కదా!అలా నీళ్ళు చల్లినప్పుడు పాలు పొంగడం ఆగిపోతాయి.ఇలా తన స్నేహితుడైన నీరు తనలోకి వచ్చి చేరడంతో క్షీరం సంతోష పడిందట.
మహాత్ములు అంటే గొప్పవారు.గొప్ప లేదా మంచి మనసున్న వారి మధ్య స్నేహం ఈ విధంగా ఉంటుందని " క్షీర నీర న్యాయము" చెబుతుంది.
ఇలాంటిదే మహాభారతంలోని కర్ణ సుయోధన స్నేహం.కర్ణుడికి రాజ్యం ఇచ్చి రాజును చేసినందుకు కృతజ్ఞతగా కుంతీ కుమారుడు అయినప్పటికీ పాండవులతో యుద్ధం చేసి జీవితాన్ని త్యాగం చేస్తాడు.
త్యాగం, ప్రేమతో కూడిన స్నేహం చేయాలని, అసలైన స్నేహమంటే ఇలా ఉండాలని ఈ క్షీర నీర న్యాయము మనకు తెలుస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి