న్యాయాలు -53
గగన కుసుమ న్యాయము
*****
గగనం అంటే ఆకాశం,నింగి,అంబరం,అంతరిక్షం అనంతం,మిన్ను,దివి అనే అర్థాలు ఉన్నాయి.కుసుమం అంటే పువ్వు/ పుష్పము,విరి లాంటి అర్థాలు ఉన్నాయి.
ఆకాశములో పూలు పూయడం అసంభవం, అసాధ్యం కూడా. మనకు సాధ్యం కాని,పొందలేని వాటి గురించి ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మొక్కలకు చెట్లకు, తీగలకు పూలు పూస్తాయి కానీ శూన్యంగా ఉన్న ఆకాశానికి పూలు పూయవు కదా!.
భారత,రామాయణ ఇతిహాసాలు ,పురాణాల్లో స్వర్గలోకం,నరక లోకం ఇంద్రలోకాలు మొదలైనవి ఉంటాయని చదువుకున్నాం.
నరక లోకం పాతాళంలోనూ,ఇంద్ర లోకం ఆకాశంలోనూ ఉంటాయని అంటుంటారు.ఇంద్ర,స్వర్గ లోకాల్లో దేవతలు నివసిస్తారనీ,ఆ లోకంలో కామ ధేనువు, ఐరావతం లాంటి వాటితో పాటు కల్పవృక్షం, పారిజాతం లాంటి వృక్షాలు ఉంటాయని చదువుకున్నాం.
అవి చదవడం ,వినడమే తప్ప చూసిన వారూ, కోసిన వారూ ఎవరూ లేరు. మానవుడికి వాటిని పొందడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. కాబట్టి దీనిని గగన కుసుమ న్యాయంగా చెప్పుకోవచ్చు. "ఆకాశానికి నిచ్చెన వేయడం"అనేది ఈ న్యాయానికి చాలా దగ్గరగా ఉన్న సామెతగా చెప్పుకోవచ్చు.
ఇలా అసంభవమైన వాటిని పొందాలని చేసే ప్రయత్నం,గగనంలో పూలు కోసుకోవడం లాంటిదని, అది వృధా ప్రయాస అని చెప్పేటప్పుడు ఇలా ఆకాశ కుసుమ న్యాయము లేదా గగన కుసుమ న్యాయము అంటారు.
ఇలాంటి పోలికలను ఉపమానాలతో కూడిన న్యాయాలను సందర్భానుసారంగా ఉపయోగించిన మన వెనుకటి తరం ఎంత గొప్పదో కదా!.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి