భారతదేశంలో బానిసత్వం?;- - యామిజాల జగదీశ్
 1946లో, అమెరికాలోని క్లీవ్ ల్యాండ్లో
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐరన్ & స్టీల్ కమిటీ) సమావేశమైంది. దీనికి  అనేక దేశాలు, ఉక్కు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 
మన దేశంలోని టాటా స్టీల్‌ తరఫున కె.ఎ.డి. (కిష్...1893 - 1977) నౌరోజీ ప్రాతినిధ్యం వహించారు.
ఈ సమావేశంలో భాగంగా ఆసియాలోని "వెనుకబడిన" దేశాలపై కూడా చర్చ జరిగింది.
ఒక అమెరికన్ ప్రసంగిస్తూ "భారతదేశంలోని ఉక్కు కార్మికుల పరిస్థితి బానిసత్వంలా ఉంది" వ్యాఖ్యానించారు. ఇది దారుణమైన ఆరోపణ.
అంతట కిష్ నౌరోజీ లేచి నిల్చుని తనదైన ధోరణిలో సున్నితంగా స్పందించారు.
1912లో టాటా స్టీల్ ఎనిమిది గంటల పని దినాన్ని ఎలా ప్రవేశపెట్టిందో కిష్ వివరించారు. అమెరికా లేదా యూరప్‌లో ఈ పని దినాన్ని ఆమోదించడాని కన్నా ముందరే తమ సంస్థ అమలులోకి తెచ్చిందన్నారు. 1911 నాటి ఫ్యాక్టరీల బిల్లును ప్రస్తావిస్తూ బ్రిటన్‌లో పన్నెండు గంటల చట్టపరమైన పరిమితిని పేర్కొన్నారు. 
తమ సంస్థ టాటా స్టీల్ ఉద్యోగుల కోసం  అందించే ఉచిత వైద్య చికిత్స, వారి పిల్లలకు ఉచిత పాఠశాలల గురించి కిష్ వివరించారు. అలాగే 1920లో వేతనంతో కూడిన సెలవును ప్రవేశపెట్టడాన్ని ఉదహరించారు. 1930లో ప్రవేశపెట్టిన బోనస్ పథకాన్ని తెలుపుతూ తమ ప్రసంగాన్ని ముగించారు.
కిష్ మాట్లాడిన తర్వాత సమావేశ మందిరంలో నిశ్శబ్దం ఆవరించింది.
ఈ ఉదంతాన్ని వివరిస్తూ మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్, "భారత ఉక్కు పరిశ్రమలో బానిస కార్మికులు ఆనే దానిపై మరెవ్వరూ చర్చించ లేదు" అని ఓ వ్యాసంలో రాశారు.



కామెంట్‌లు