శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మన్మధుడు శివుని చే బూడిద గా మారినందున అనంగుడని పిలవబడుతున్నాడు.కందర్ప కుసుమాయుధుడు పుష్పధన్వా పంచశరుడు కామదేవుడని పేర్లు.మకరం లేక మీనం  చిహ్నం గా ఇతని జెండా ఉండటంతో మకరకేతు మకరధ్వజుడు మీనకేతు అనే పేర్లు కూడా ఉన్నాయి.మాయీ మాయాసుత శ్రీనందన అని అంటారు.అత్యంత ఆకర్షణ కలవాడు కావున అభిరూప  దర్పక్ దీపక్ గదయిత్ను గృధు గృత్స మధుదీప స్మర రూపాస్త్ర  రమణ్ మదన్ అని పేర్లు.ఋగ్వేదం 10వ మండలంలో 129వ సూక్తంలో ప్రధమంగా పేర్కొన్నారు.కామన ఇచ్ఛా కి పర్యాయం.అథర్వవేదంలో పరమాత్మ ఆదిస్రష్ట గా ప్రార్ధించబడినాడు.వేదంలో కాముని ప్రస్తావన ఉంది.కాశీ పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు.దీని ఇతరపేర్లు స్మశాన్ మహాస్మశాన్.ఆనందకానన్ అంటారు.శమ్ అంటే శవం శాన్ అంటే పడుకోవటం.ప్రళయంలో ఆత్మ లు నివాసం ఉంటాయిట! పద్మపురాణం ప్రకారం కాశీ ప్రసిద్ధ ప్రేత భూమి.సంహారకరూపంలో శంకరుడు ఉంటాడు.
కుడ్జూ అంటే గూని ఉన్నది.కంసుని దాసి కుబ్జని కృష్ణుడు తన రెండు పాదాలతో ఆమె పాదాలను నొక్కి చేతులతో స్పృశించగానే ఆమె గూని పోయింది.ఇది నేటి శరీరమసాజ్ అనుకోవచ్చు కదూ?
సంస్కృతం లో కుమారికా అంటే అవివాహిత కుమారి అని అర్థం.దీని తద్భవరూపం కుంవరీ క్వారీ అని.12ఏళ్ల పెళ్లి కాని అమ్మాయి.8ఏళ్ల పిల్లగౌరి 10కి కన్యా 12ఏళ్ళకి కుమారి . నవరాత్రులలో కుమారి పూజ చేస్తారు.పెళ్లికాని పిల్లని ప్రౌఢని జరత్కుమారి అంటారు.పార్వతి దుర్గా సీతని కూడా కుమారి అనే పిలుస్తారు.

కామెంట్‌లు