బాబూ - పాపా.....
భయపడకండి... !
పిల్లలు తెలియక అడిగిన
ప్రశ్నలకు... పెద్దలు తెలియక
చిరాకు పడకండీ... !
మాకూ తెలియదు
తెలిసుకుందాము
అంటూ, నచ్చజెప్పండి !
పెద్దలు చక్కగ తెలుసుకునీ
పిల్లలకు తెలియ జెప్పండి!
ఎన్నో తెలిసిన పెద్దలకైనా
తెలియని విషయా లెన్నెన్నో
అన్నీ తెలిసిన విజ్ఞులు కొందరు
ఖచ్చితంగా ఉంటారు !
గ్రంధాలయాలలోనూ మనకు
పుస్తకాలెన్నొ ఉన్నాయి,
శ్రద్దగా మనము వెదికితే...
సమాధానాలు దొరుకుతాయి
ఇంకా సులువుగ తెలుసుకునే సెల్ఫోనిప్పుడు మన కుంది !
అడిగిన ప్రశ్నకు క్షణాలలో...
జవాబు చెప్పేస్తుంది... !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి