సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-33
కాకతాళీయ న్యాయము
*****
కాకము అంటే కాకి. తాళము లేదా తాలః అంటే తాడి చెట్టు/ తాటి చెట్టు.
కాకి తాటి చెట్టు మీద వాలగానే అనుకోకుండా తాటిపండు రాలి పడటాన్ని కాకతాళీయం అంటారు.
కాకి  వాలడం వల్ల తాటిపండు రాల లేదు. కాకికి ఆ తాటిపండును రాల్చేయాలనే ఆలోచనా లేదు.కాకి అటూ ఇటూ ఎగురుతూ వచ్చి  తాటి చెట్టు మీద వాలడం.
సరిగ్గా ఆ సమయంలో తొడిమ ఊడి పండు రాలే సమయం ఆసన్నం కావడంతో చటుక్కున అది రాలి కింద పడటం జరిగింది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి ఈ సంఘటన వల్ల తాటి పండు లభిస్తుంది. కాకి తనకోసమే దానిని పడవేసిందేమో అనుకుని ఆనంద పడతాడు. కానీ కాదు కదా!
ఈ విధంగా రెండు సంఘటనలు ఓకే సారి ఏక కాలంలో జరగడం విశేషం. ఇలా ఒకదానితో ఒకటి పొంతనలేని సంఘటనలు జరిగి వాటిమధ్య ఓ సంబంధాన్ని ఏర్పరడడాన్ని కాకతాళీయ న్యాయము అంటారు.
అప్పుడప్పుడు మన జీవితంలో అనుకోని సంఘటనలు మంచివో,చెడువో జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని ఆయా వ్యక్తులకు ఆపాదిస్తూ ఉంటాం.కానీ తర్వాత తెలుస్తుంది కాకతాళీయంగా జరిగాయని.
అనుకోకుండా కొన్ని మంచి సంఘటనలు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు ఆ సమయంలో అక్కడ ఉండటం జరుగుతుంది.అది కాకతాళీయంగా జరిగినా తమ వల్లే,తమ గొప్పే అని చెప్పుకోవడం, వాటిని నిజమే అనుకోవడం కూడా చూస్తూ ఉంటాం.
 ఇలాంటి విషయాలకు కాకతాళీయ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం