నిప్పు కణికలు;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
గడిచి పోయిన కాలం
మళ్లీ మళ్లీ  రాదు
జారిన మాట తీసుకొన
ఏమాత్రం వీలుకాదు

బట్టలపై మరక పడితే!!
తుడిచి వేయ వీలగును
బ్రతుకున మచ్చ పడితే
చెరుపుట అసాధ్యమగును

మనిషి జీవితం అద్దం
అందరికీ కన్పిస్తుంది
తెరువబడిన పుస్తకం
చదువుటకు అనువైనది

పెంచుకుంటే బంధం
పెరుగుతుంది అనంతం
పువ్వుల వోలె  అందం
 కాక మానదు అంతం


కామెంట్‌లు