జగతిని వెలుతురు తోటను
చేయడానికి
తూరుపింట వేకువ పువ్వు
విరిసింది
చిన్ని అలల గుసగుసలు
సుదూరతీరాలకు వినిపింప చేయాలని చల్లగాలి
పరుగులు తీస్తోంది
ఎవరో చూస్తారనీ.....
ఎవరో ఆనందిస్తారని
అసలు ఆలోచించక
హాయిగా ముద్దుగా విరిసి
కళకళ లాడుతూ
నవ్వులు విరిసే పువ్వులు
మనకు దొరికిన జీవితాన్ని
చక్కగా అనుక్షణం జీవిస్తూ
సాగిపోవాలి
కష్థసుఖాలూ ఋతువుల మల్లే
వచ్చీ పోయేవే!
ఆనందపు కెరటాలు
మనమే సృష్టించుకోవాలి
అనుభవాల మాలలు
మనమే గుచ్చి గుర్తుంచుకోవాలి
మన అనుభూతుల గోతమే
మన జీవితం....
నిన్నను మరిచి రేపటికోసం
ఎదురు చూడ్డంలో
ఈరోజును
గడిపేయడమే ఆనందం
మనకోసం ఆనందం
ఆనుగ్రహిస్తూ వచ్చే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి