" జీవితంలో గురువుల పాత్ర ";- కోరాడ నరసింహా రావు
 * తపస్వీ మనోహరం *వ్యాస రచన పోటీలో... 500/- బహుమతిని గెలుచుకున్న వ్యాసం... ! 
==============================================================
" గురువే సర్వలోకానాం... 
   భిషజే భవ రోగినాం... 
     నిధయే సర్వ విద్యానాం... 
     ........................... "
    అన్నారు  విజ్ఞులు.. !
     
 గురువంటే...మనలోని అజ్ఞాన 
తిమిరాన్ని తొలగించి... జ్ఞాన వెలుగులతో...మనకుసుఖానం దసౌఖ్యాలనుప్రసాదించేత్రిమూ 
ర్త్యాత్మకుడు... !
గురువు బ్రహ్మయై బోధిస్తాడు 
విష్ణువై  నడిపిస్తాడు 
   శివుడై గమ్యాన్ని చేర్పిస్తాడు!
సృష్టిలో ప్రతిప్రాణికీ... మరీ ముఖ్యంగా మనిషికి... జన్మ నిచ్చిన తల్లే  తొలిగురువు !
    మనం తనగర్భంలోకి ప్రవే శించగనే మనకు తన బోధన మొదలౌతుంది !!
 లోకజ్ఞానాన్ని, వ్యవహారచాతు ర్యాన్ని చదువురూపంలో బోధిం
చేగురువులు పాఠశాలలో ఉపా ధ్యాయులే ఐనా... అమ్మ మన వెన్నంటే ఉండి... మనం ప్రయో జకులమయేవరకూ మనపట్ల తన గురుతర బాధ్యతను నిర్వ ర్తిస్తూనే ఉంటుంది... !
 ముఖ్యంగా...పరిసరాలు,పరిస్థి తులఅనుభవాలే పాఠాలుగా... 
నేర్చుకుంటూ అనుకరించి,అను
సరించే తత్త్వం మనిషిది !
ఈ పంచభూతాల సమస్త ప్రకృ తీ ఈ మనిషికి గురువైబోధిస్తూ నేవుంది !గ్రహించగలిగేవారు 
ఉత్తమశిష్యులై సుఖిస్తారు !
ప్రత్యక్షం గానో... పరోక్షంగానో ప్రతిఒక్కరికీ గురువు అనేవారు ఉండితీరాల్సిందే..."గురువులేనివిద్య గ్రుడ్డివిద్య" అని ఊరకే అనలేదుగా మన పెద్దలు !
కబీర్ దృష్టిలో... ఆ గోవిందుని కంటే శిష్యునికి గురువే గొప్ప !
కబీర్ అంటారు : ఆ గోవిందుడు గురువు ఇద్దరూ ఒకేసారి నాఎ  దురుగా వస్తే... నేను మొదట నా గురువుకే నమస్కరిస్తాను !
ఎందుకంటే... ఆ గోవిందుని గురించి తెలియజెప్పినవారు నాగురువే కదా..!!"నాగురువే లేకపోతే ఆ గోవిందుని నేను తెలుసుకుని ఉండే వాడనే  కాను...! " అంటారుకబీర్. 
 మంచి గురువు దొరకటమంటే అది మహాభాగ్యమే... !
నారదునివంటిగురువుమూలం
గానే, రత్నాకరునివంటి దారిదో 
పిడీదొంగ వాల్మీకియై విశ్వవి ఖ్యాత శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని ఈప్రపంచానికందించి
చరితార్థుడైనాడు కదా ... !
మనిషిగా పుట్టినవారు మనిషిగా ఎలా బ్రతకాలో... 
ఈ ప్రపంచానికి ఉత్కృష్టమైన గీతద్వారాబోధించిన శ్రీకృష్ణుడు జగత్గురువైనాడు కదా  !
రామకృష్ణ పరమహంస వంటి గురువు మూలంగానే స్వామి వివేకానంద గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తయై ప్రపంచంలో భారతదేశానికే ఎనలేని ఖ్యాతిని ఆర్జించగలిగాడు...!
ప్రత్యక్ష గురువులైన వీరే కాదు 
ఆదిశంకరాచార్య, గౌతమబుద్ధ 
మొదలుకొని..భతృహరి,బద్దెన 
వేమన వంటి వారితో సహా... 
 నైతిక పతనంలో కొట్టుకుపో తున్న సమాజాన్ని తమ - తమ అద్భుత ప్రసంగాలతో సన్మార్గం లో నడిపించే ప్రయత్నంచేస్తున్న 
పరోక్షగురువులు ఎందరో !
ఇట్టి గురువులే లేకుంటే... 
 ఈపాటికి ఈ సమాజ స్థితిని... ఊహించుకోటానికే భయం వేస్తుంది... !
 ఉత్తమ తొలిగురువు తల్లితో పాటు... మనకు మూడురకాల గురువులు ఉన్నారు !
  వారిలో  చదువు, సంధ్యలు నేర్పే ఉపాధ్యాయులు ఒక రకం గురువులైతే..., జీవనోపాధి విద్యలు నేర్పిబ్రతుకుదారి చూపిన వారు  రెండవ రకం గురువులు !
 ఇక మానవజన్మ అర్ధాన్ని, పరమార్ధాన్ని బోధించి... జనన మరణ బాధాభయాలను తొల గించి మోక్షాన్ని ప్రాప్టింపజేసే ఆధ్యాత్మిక గురువులు... !
 మనిషిజీవితంలో...ఈముగ్గురు
గురువులూ ఆవశ్యమే... !
ఈ గురువులు లేనిదే... సన్మతి సద్గతి రెండూ సూన్యమే... !!
మంచి గురువులుదొరికినవారు
ధన్యులు !
 నాడుద్రోణుడు,పరశురాముడు వంటి గురువులు... నేడు తండ్రి వంటి గురువు స్థానంలో వుండి 
కన్నబిడ్డలవంటివిద్యార్థినులనుకన్నుగానని కామంతో చెరిచే ఉపాధ్యాయులు ఉండటం... 
గురుపదానికే  తలవంపులు !
గురువు అనిపించుకున్నవారు 
గురుబ్రహ్మ, గురుర్విష్ణు,గురు దేవో మహేశ్వరః... గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేన్నమః అనిపించుకోగలగాలి.. !
అలాంటి గురువులు నేటి ఈ సమాజానికి అత్యావశ్యకం !!
     *******

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం