న్యాయాలు-37
కులాల కీట న్యాయము
*****
కులాలము అంటే కుమ్మరి.కులాల కీటము అంటే కుమ్మరి పురుగు.
కుమ్మరి పురుగు ఎప్పుడూ మట్టిలోనే తిరుగుతూ ఉంటుంది కానీ దానికి మట్టి అంటదు.
దీనిని వ్యక్తి పరంగా అన్వయించుకుంటే భుక్తి కోసం చేసే వృత్తి ఎలాంటిదైనా ప్రవృత్తి పరంగా మానవీయ విలువలతో జీవించే వ్యక్తులకు ప్రామాణికంగా ఈ కులాల కీట న్యాయమును చెప్పుకోవచ్చు.
మహా భారతంలో ధర్మవ్యాధుని కథ ఇలాంటి న్యాయానికి దగ్గరగా ఉంది.
కౌశికుడు అనే మహా తపస్సంపన్నుడు.వేదాల సారం మరిచి తనపై రెట్ట వేసిన కొంగను తీక్షణంగా చూడటంతో కొంగ మరణిస్తుంది.
ఆ తర్వాత అతడు భిక్షాటనకు వెళ్తాడు.,ఓ ఇల్లాలు కుటుంబ సభ్యుల సేవలు ముగించిన తర్వాత భిక్ష తీసుకొని వస్తుంది. ఆలస్యానికి కోపం వచ్చి ఆమెను శపించబోతుంటే "నేను కొంగను కాదు నీ చూపుకు భస్మమై పోవడానికి. కోపాన్ని మించిన శత్రువు లేదు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ మానవీయ విలువలతో బతికిన వారే గొప్ప వారు.అలాంటి వ్యక్తే ధర్మ వ్యాధుడు.ఇలాంటి ధర్మ సందేహాలు తెలుసుకోవడానికి అతన్ని కలవండి."అంటుంది.
కౌశికుడు తన అపరాధానికి చింతిస్తూ ధర్మ వ్యాధుని కలుస్తాడు.అక్కడ ధర్మ వ్యాధుడు చేస్తున్న కటిక వృత్తిని చూసి ఆశ్చర్య పోతాడు.
తన తల్లి తండ్రులను సేవించి వచ్చిన ధర్మ వ్యాధుడు కౌశికుడితో "ఏ పనినైనా నిష్కామకర్మ తో చేయాలి.స్వధర్మ పాలన మనకు తృప్తితో పాటు , ఆత్మ శక్తిని కూడా ఇస్తుంది. మానవతా విలువలతో బతకడాన్ని మించిన గొప్ప జీవితం మరొకటి లేదని చెబుతాడు.
ఆ మాటలు కౌశికుడిలో కనువిప్పు కలిగిస్తాయి.ఇది కులాల కీట న్యాయమునకు ఉదాహరణగా చెప్పవచ్చు.
దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కుమ్మరి పురుగులా స్వచ్ఛతను వీడకుండా ఉండాలి.
దీనికే మరో ఉదాహరణగా పంకంలో వికసించిన పద్మం.చుట్టూ బురద ఉన్నా ఏమీ అంటకుండా తనదైన ఉనికితో ఆకట్టుకుంటుంది.
ఇలా కులాల కీటము , పంకంలో పద్మంలా జీవించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి