సాహిత్యసేద్యం సాగాలి
పువ్వులు పూయాలి
కాయలు కాయాలి
కవిత్వం పండాలి
కవులు కదలాలి
కదము త్రొక్కాలి
కలములు పట్టాలి
కవనము చెయ్యాలి
నిప్పులు చిందించాలి
నిజాలు చూపించాలి
కత్తులు ఝలిపించాలి
కదనము తలపించాలి
అక్షరాలు వెలగాలి
పదాలు ప్రకాశించాలి
కవితలు కళకళలాడాలి
మనసులు మెరిసిపోవాలి
ఆలోచనలు అదిరిపోవాలి
భావాలు భలేబాగుండాలి
గుండెలు గుబాళించాలి
హృదయాలు ద్రవించాలి
పిల్లలు పరవశించిపోవాలి
పడుచువాళ్ళు పులకించాలి
పెద్దలు ప్రమోదంపొందాలి
పాఠకులంతా పొంగిపోవాలి
అందాలను అగుపించాలి
అంతరంగాలను ఆకట్టుకోవాలి
ఆనందం పెళ్ళుబికిపారాలి
అందరూ ప్రతిస్పందించాలి
పదేపదే చదవాలి
భళేభళే అనాలి
చప్పట్లు కొట్టాలి
ముచ్చట్లు చెప్పాలి
ముత్యాల్లా ధరించాలి
రత్నాల్లా దాచుకోవాలి
కనకంలా కాచుకోవాలి
సంపదలా కాపాడుకోవాలి
మనసంస్కృతిని చాటాలి
మనోవిఙ్ఞానాన్ని పెంచాలి
మనజాతిని జాగృతంచెయ్యలి
మనసాహిత్యాన్ని సుసంపన్నంచెయ్యాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి