సుగుణ సాహితి కథల పోటీకి అనూహ్య స్పందన .

 సిద్దిపేట కు చెందిన సుగుణ సాహితి సమితి వరుసగా నాలుగవ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఉగాది బాలల కథల పోటీకి ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు వ్రాసిన కథలు 217 రావడం   బాల సాహిత్య వికాసానికి నిదర్శనమని కన్వీనర్ భైతి దుర్గయ్య మంగళవారం సిద్దిపేట లో తెలియచేసారు. ముభారస్ పూర్-19,చందాపూర్-14 , ఇందిరా నగర్ - 64, కొండపాక బాలురు-1 మరియు బాలికలు-11,జక్కాపూర్-13,వేచరేణి18 - ,రామునిపట్ల -28 , నర్మెట్ట - 5, చిన్నకోడూర్ -16 , గుర్రాలగొంది-6 , లక్ష్మిదేవిపల్లి-2 , సికిందలాపూర్-6, మెరిడియన్ స్కూల్ -2,శ్రీ చైతన్య టెక్నో స్కూల్ -3 పాఠశాలల నుండి కథలు వచ్చాయని,న్యాయ నిర్ణేతలకు కథలు పంపి,వచ్చే ఉగాది నాటికి విజేతలను ప్రకటించి, ఉస్మానియా విశ్వవిద్యాలయము విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నాకృష్ణారెడ్డి సౌజన్యంతో బహుమతులు అందిస్తామని కన్వీనర్ చెప్పారు. అమెరికా నుండి సుగుణ సాహితి సమితి అధ్యక్షులైన డా.మొసర్ల మాధవరెడ్డి గారు ,కథలు వ్రాసిన విద్యార్థులకు ఆశీస్సులు, విద్యార్థులు కథలు వ్రాసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులు అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు .
కామెంట్‌లు