కన్నప్రేమ!అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రతిప్రాణికీ తన ప్రాణంపై తీపి ఉంటుంది. ముందు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు.పిల్లి తనకూనల్ని నోటకరుచుకుని కాపాడటం మార్జాలన్యాయం.కోతి పొట్ట వీపుపై బిడ్డను మోస్తుంది.కానీ ఎండ చుర్రు మంటే పిల్లను నేలపై పడేసి తను ఎక్కి కూచుంటుంది.ఓకోతి నీటిగుంటలో పడితే పిల్లను పడేసి దానిపై ఎక్కి బైటికి దూకేసింది.ఇదే మర్కటన్యాయం! ఆరోజు హఠాత్తుగా ఇంటికి నిప్పు అంటుకుంది.శివా ఏడాది కొడుకు నిద్రపోతున్నాడు.ఆపక్కనే శివా తండ్రి పడుకున్నాడు.శివా గబగబా పిల్లాడ్ని ఎత్తుకుని తండ్రిని అలా చేయి పట్టుకొని గుంజుకుపోయాడు బైటికి. "శివా!పసివాడితో నీవు తొందరగా వెళ్లు.నేను రాలిపోయే వాడినే" అని ఆ వృద్ధుడు  అన్నా వినిపించుకోలేదు."నాన్నా! నీవు లేకుంటే నేను ఈలోకంలోకి వచ్చేవాడిని కాదు గదా!రేపు నేను వృద్దుడిని ఐనాక నాకొడుకు నన్ను  ఆపదలో వదిలేస్తే నేను బాధ పడనా నాన్నా!" అంటున్న శివాని  అంతా ప్రశంసించారు 🌹


కామెంట్‌లు