కానుక! అచ్యుతుని రాజ్యశ్రీ

హిందీ టీచర్ సూరదాస్ నిగూర్చి పాఠం చెప్తోంది. చిన్నికృష్ణుడు యశోదని అడుగుతున్నాడు"అమ్మా!అన్న బలరాముడు తెల్లగా నేను నల్లగా ఉన్నామని నన్ను అంతా ఏడ్పిస్తున్నారు.నన్ను ఎక్కడనించైనా తీసుకుని వచ్చి పెంచావా?" ఆవివరణ వింటూనే జయమనసులో ముల్లు గుచ్చుకున్నంత బాధ కల్గింది. టెన్త్ చదువు తున్న జయ ఆలోచిస్తోంది " అమ్మా నాన్న లు తెల్లగా అందంగా ఉన్నారు. కానీ తను మాత్రం కారునలుపు.మొన్న ఫంక్షన్ లో ఎవరో అడిగేశారుకూడా" ఏంటీ!ఈపాప ని మీరు పసిపిల్లగా రోజుల పిల్లనే తెచ్చి పెంచారా? కాస్త మంచి రంగు ఉన్న పసిపాప దొరకలేదా మీకు?" దానికి తల్లి ఇలా అంది" రంగులో ఏముంది? మన పెంపకం లో ఉంటుంది. మాకు పిల్లలు పుట్టరని తేలిపోయింది. మాదూరపుబంధువు ఈపాపని కని మూడోరోజున చనిపోయింది. ఆయన కి అప్పటికే ఇద్దరు పిల్లలు. అందుకే తల్లి లేని లోటు లేకుండా నేను పెంచాను.ఆమె నాబాల్యస్నేహితురాలు కావటం ఇంకో విశేషం. "అంతే అడిగిన ఆమె నోరు ఠక్కున మూసింది.అంతే జయ ఇంటికి రాగానే అడిగింది "అమ్మా!ఐతే నేను మీ కన్నబిడ్డను కానా?" కళ్ళవెంబడి బొటబొటా నీరు కారుతోంది. అమ్మ  ఆప్యాయంగా జయను గుండెకి హత్తుకుని అంది" పిచ్చి తల్లీ! నీకు పరీక్షలు ఐనాక నిజం చెబ్దామని అనుకున్నాను.మీఅమ్మ నేను ప్రాణస్నేహితులం బంధువులం.కన్నప్రేమ కన్నా పెంచినప్రేమ గొప్పది.అనాధబాలల ఆశ్రమం నించి  విదేశీయులు కూడా పెంపకానికి తీసుకుని వెళ్తారు.నీవు అదృష్టవంతురాలివి.ఇలాంటి ఆలోచనలు వద్దు. " జయ తండ్రి కూడా అలాగే నచ్చచెప్పాడు."నీవు మాకు దేవుడు ఇచ్చిన కానుక అమ్మా!" అంతే జయ వారిద్దరి పాదాలపై వాలి" అవును!మీఒడిలో పెరిగిన నాకు దేవుడు మంచి కానుక ఇచ్చి నన్ను అదృష్టవంతురాలిగా చేశాడు "అని హాయిగా నవ్వింది 🌹 
కామెంట్‌లు