మాష్టార్లే కారణం;- - యామిజాల
 రాము : నువ్వు అప్పులపాలవడానికి మన లెక్కల మాష్టారే కారణమా?
సోము : అవును. అంతెందుకూ ...ఈ దేశం అప్పులపాలవడానికీ మన మాష్టారే కారణం.
రాము : ఏమంటున్నావురా? అర్థం కాలేదు.
సోము : అర్థం కాకపోవడానికేముంది?
రాము : ఏమంటున్నావురా?
సోము : 7లో నుంచి 9 పోతుందా?
రాము : అదెలా పోతుంది?
సోము : అలాగైతే మరేం చేయాలి?
రాము : పక్కన అప్పు తీసుకుని 7ని 17 చేసి అందులో నుంచి 9 తీసెయ్యాలి. ఈ విషయాన్ని మనకు ఒకటో క్లాస్ టీచర్ చెప్పారుగా.
సోము : చూసేవా...నువ్వే చెప్తున్నావు....ఒకటో క్లాస్ టీచర్ మొదలుకుని కాలేజీ చదువులయ్యే వరకూ పక్కనున్న వారి దగ్గర అప్పు చేయడం చెప్పారు తప్పించి అప్పెలా తీర్చాలోనని ఎవరూ ఎక్కడా చెప్పలేదుగా. ఇప్పుడు చెప్పు ....నేనూ ఈ దేశమూ అప్పులపాలవడానికి కారణం ఈ మాష్టార్లే కదా. కాదంటావా??
ఆ మాటతో ఇక రాము ఇంకేమంటాడూ?
- యామిజాల జగదీశ్
----------------------------
2
-----------------------------
ట్యాక్సీ నడపటం 
తొలిసారండీ
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
 ట్యాక్సీలో వెళ్తున్న ప్రయాణికుడు ఏదో చెప్పడం కోసం డ్రైవర్ భుజం తాకాడు.
వెంటనే డ్రైవర్ కంగారుపడి కారుని తారుమారుగా తిప్పాడు. 
కారు ప్లాట్ ఫారం ఎక్కి ఓ దుకాణాన్ని 
డీకొనే సమయంలో ఎలాగో ఆ ప్రమాదం నుంచి బయటపడి బ్రేకు వేసి బండిని ఆపగలిగాడు.
"సారీ నాయనా, మెల్లగా భుజాన్ని తాకినందుకే ఇంతలా కంగారుపడతావని నేననుకోలేదయ్యా" అన్నాడు ప్రయాణికుడు.
డ్రైవర్ "మీ తప్పేమీ లేదు సార్. నేను ట్యాక్సీ డ్రైవరుగా ఇప్పుడే తొలిసారిగా బండి తోలుతున్నాను. ఇంతకుముందు నేను ఇరవై అయిదేళ్ళపాటు 'అంతిమయాత్ర వాహనాన్నే' నడిపానండీ" అన్నాడు.

కామెంట్‌లు