తూరుపు తలుపుల
చీకటి గడియలు తీసేసి
ప్రభవించు ప్రభాకరుని చూసి
భావములు భాసించగా
కొండల నడుమ నిండుగ
నవ్వుతూ చకచకా పైకెదిగి
నింగీ నేలకు బంగరు
వెలుగులు చిమ్మేసి
మగత నిదుర పోతున్న
జగతిని మేలుకొలిపేసి
పరుగులు తీస్తూ పయనించే
గాలితో స్నేహం చేసేసి
గిరుల నుండి దూకుతున్న
ఝరులకు జరీశాలువా కప్పేసి
చిగురుటాకులకు మిసమిస
మెరుపులుపొదిగేసి
తీగను ఊగే సుమబాలలకు
తీయని ముద్దూ పెట్టేసి
కలివిడిగా అంతటా
కిరణాలు పంపేస్తూ
భువనాలు పులకించ
పలకరిస్తూ సాగుతున్న
దినకరుని ఆత్మీయతకు
అంజలి ఘటిస్తూ
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి