సభ్యత సంస్కారం;- : సి.హెచ్.ప్రతాప్
 నిన్నటి తరంలో పెద్దలు చిన్నపిల్లలు, చిలుకల ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని పలుమార్లు చెప్పే వాళ్ళు . ఎందుకంటే మనము పలికే ప్రతి పదాన్ని అర్థము తెలియకున్నాచిలుకలు తిరిగి పలకడం జరుగుతుంది.వాటినే చిలక పలుకులు అని కూడా అంటారు.
 ఒక వేళ మనం తప్పుడు మాటలు, ద్వందర్ధాలు వున్న మాటలు పలికితే, దానర్ధంతో అవసరం లేకుండా  చిలుకలు తిరిగి మాట్లాడుతాయి.వాటికి అర్థాలను వివరించి వాటిని అనవద్దని చెప్పినా చిలుకలకు అది అర్ధం కాదు . అందుకే చెడ్డ పదాలు నేర్చిన చిలుకలను అడవిలోవదలడము తప్ప మరో మార్గము లేదు. అదే విధంగా పిల్లలు కూడా పెద్దవారు మాట్లాడే మాటలనే తిరిగి రిపీట్ చేస్తారు. వారికి వాటి అర్ధం తో పని లేదు.
   అందుకే పిల్లల ముందు ప్రతి పదాన్నిజాగ్రత్తగా మాట్లాడాలి.మన ప్రవర్తన కూడా చాలా అత్యంత మెలకువగా ఉండాలి.పిల్లల ముందు తన తల్లిదండ్రులను, ఇతర పెద్దలను, భార్యను అసభ్యకరంగాను- అసహ్య కరం గాను అభ్యంతర కర -అసహ్య కర పదజాలాన్ని ఉపయోగించకూడదు. .తల్లిదండ్రులే ఆది గురువులు కాబట్టి అనేకానేక అంశాలను వారే పిల్లలకు నూరి పోసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. పసిపిల్లల మనసు తెల్లకాగితం వంటిది. దానిపై ఏ వర్ణపు సిరాతో వ్రాస్తే ఆ వర్ణపు (రంగు అక్షరాలూ కనిపిస్తాయి అన్నది పెద్దల మాట.
     ఇటీవలి కాలంలో  తల్లిదండ్రులు,ఇతరపెద్దలుచిన్నపిల్లలకుజాతి,కుల,మతాలతో బాటు చిన్నతనములోనే రాజకీయాలను నూరిపోస్తున్నారు. చిన్నారుల మనస్సులోఅనవసరమైన విషయాలను చొప్పించి, విషపూరితము గావిస్తూ వారి బంగారుభవిష్యత్తును చేజేతులా నాశనము చేస్తున్నారు.    ఇంటిలో ఆరోగ్యకరమైన ప్రశాంతవాతావరణాన్ని కల్పించడములో విఫలమవుతున్నారు.
ఇకనైనా అలాంటి చెడుప్రవర్తనను మార్చుకోవాలి. మన మాటలే మన బిడ్డలకూ వస్తాయన్నది గుర్తుంచుకోవాలి. మహాత్మాగాంధీజీ అందుకే ‘చెడు కనవద్దు.. చెడు వినవద్దు… చెడు మాట్లాడవద్దు’ అని ఎప్పుడో చెప్పారు. ఇకనైనా మంచిచెడులు తెలుసుకుని సమాజంలో మసలుకోవడం సర్వవేళలా శ్రేయోదాయకం.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం