ఈ మాత్రం దానికేనా...?; - - యామిజాల జగదీశ్
 ప్రతి పూటా అన్నం తిని చేతులు కడుక్కునేటప్పుడు మాత్రం "నేనింత తినకుండా ఉండాల్సిందేమో" అని అనిపిస్తోందా?
ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు మాత్రం ఇకమీదట అనవసరమైనవి కొనకూడదని  అనిపిస్తోందా?
జలుబుతో సతమతమవుతూ విసుగేస్తున్నప్పుడు అరటిపండు - పెరుగన్నం అంటూ తినాలనిపిస్తోందా?
ఎవరికోసమో నిరీక్షిస్తున్నప్పుడు  అనవసరపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు అనిపిస్తోందా?
మన బ్యాగుని మాత్రం ఎవరో వెతుక్కుంటూ వచ్చి చెత్తకుండీలా మార్చేస్తున్నట్టు మనసుకి అనిపిస్తోందా?
వంద పెన్నులు ఉండికూడా మన చేతికి మాత్రం రాయని పెన్నే ఎప్పుడూ అందుతోందనిపిస్తోందా?
మన ముక్కు తప్ప అందరి ముక్కూ చక్కగా తీర్చిదిద్దినట్టు అన్పిస్తోందా?
ఇతరులందరి కుడి చేతి వేళ్ళు మన కన్నా అందంగా నాజూకుగా ఉన్నాయనిపిస్తోందా?
దిగులు వద్దు.....
మనతోసహా అన్నీనూ సహజంగానే ఉన్నాయి.
ఎవరెవరితోనో 
దేనికో దానికి మనల్ని మనం పోలచ్చుకుంటూ 
వారినో వాటినో పొగుడుతూ
మనల్ని మనం తక్కువ చేసుకుంటూ బాధపడటం అనవసరం...
అందువల్ల ఒరిగేదేమీ లేకపోగా 
మన మనసు కుమిలి నలిగి చెయ్యవలసినవి సరిగ్గా చేయలేక 
చతికిలపడటం తప్ప.
అంతా సవ్యంగానే ఉందనుకుని మనమనుకున్న మంచి పనిని చేసుకుంటూ పోయే మానసిక పరిపక్వత ప్రధానం. 


కామెంట్‌లు