విశ్వనాధ్ కాశీ నాథుని విశ్వనాధులు;-బృంద
తెలుగుదనం ఉట్టిపడే
మన నట్టింట జరిగే
మన ఆత్మబంధువుల 
జీవిత చిత్రంలా
అనిపించే సినిమాలకు
చిరునామా...

నటించడం మరచి
పాత్రలో జీవించడం
అనేది అందరికీ అర్థమయేలా
చేసిన దర్శకత్వ శైలి.

మరుగున పడిపోయిన
శాస్త్రీయ  సంగీత నాట్యాలకు
ఊపిరి పోసిన
అచ్చతెనుగు మనసు.

సినిమాల వల్ల మార్పొస్తుందా
అన్న ప్రశ్నలకు 
జవాబుగా వేలాదిమంది
తమ పిల్లలకు సంగీతం
నేర్పించిన 
ఉత్తమ సమాధానం
వారి అధ్భుత అభిరుచి.

సినిమా పాటలు వినలేని
పరిస్థితి  వచ్చిన ఒకానొక
పరిస్థితి లో
పాటలు ఇలా కూడా వుంటాయి.
అని ప్రతి ఇంటా మారుమోగేలా
చేసిన అత్యుత్తమ విలువలున్న
సాహితీ అభిలాష.

సునిశిత హాస్యంలో 
మరచిపోలేని  సంభాషణలు
చిన్ని చిన్ని దృశ్యాలతో
చాలా పెద్ద సందేశాలు

మాటలే లేకుండా మౌనంగా
నటింపచేసి గొప్ప
విషయాలను మనసులను
తెరపై ఆవిష్కరించిన
అద్భుత ప్రతిభ

మంచిని 
సున్నితమైన శృంగారాలను
చతురమైన సంభాషణలను
అనిర్వచనీయమైన అభిమానాలను
అందరూ ఆమోదించేలా
అందరూ అభినందించేలా
తెరపై ఆవిష్కరించడం


వారి సినిమాలు చూడడమే
ఒక ఉత్తమాభిరుచి అని
సామాన్యులు అనుకునేంత
గొప్పగా కథను అల్లుకునే
సామర్థ్యం.

మధ్యతరగతి మనసులోని
కోరికలు....
చిరు కలహాలు
చిన్నిచిన్ని  విషయాలు
అందంగా చూపించి
హాయిగా నవ్వింవే దృశ్యాలు

సినిమా పాటకే
పట్టాభిషేకం చేసేలా
వారి సినిమా పాటలు

సిరిమువ్వలు మోగుతుండగా
శృతి లయల్లా
తలవంచి సప్తపది తిరుగుతున్న
కొత్త దంపతుల్లా
మనసును మురిపించి
స్వాతి కిరణాలు ప్రసరించే
శుభోదయాలను 
శుభప్రదంలా మలచి 
సిరివెన్నెల వెలుగుల్లోతడిపేసి
స్వాతిముత్యంలా  మనసును
మార్చేసి 
వారి చిత్రాల పాటలు..

కొందరికే సాధ్యమైన
విజయాలు వరించిన
తెలుగువారికి గర్వకారణమైన
కళా తపస్వి
తెలుగు సినీ కళామతల్లి
కిరీటంలో కోహినూర్ వజ్రం

మన 
కాశీనాధుని విశ్వనాధ్ గారు

సంపూర్ణ జీవితాన్ని
విజయవంతంగా జీవించి
వారిదైన ముద్రను
మనందరి మనసులో వేసి
రాబోయే తరాలకు
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు
ప్రతీకగా నిలిచే 
చిత్ర రాజాలను  సంపదగా
ఇచ్చి..

ఆ విశ్వనాధుని పాదపద్మాలు
చేరిన
స్వర్ణకమలానికి
నివాళులు
🌸🙏🌸


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం