సూక్తి మాధుర్యం.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 సత్య వాక్య మహిమను వర్ణించేది. సూక్తి నిధి అయిన నన్నయ వ్రాసింది. కవిత్వ చరమ లక్ష్యమైన జగతిథం చాటినాడు.
ఇది ఒక పద్య భావం.
ఒక మంచి విషయాన్ని ఎదుటి వాళ్ళ గుండెల్లో హత్తుకునేలా చేయాలి. అందుకు దాన్ని బల్ల గుద్దినట్లు చెప్పాలి. ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని మేలు, మేలు అంటూ విడమరచినాడు. ఉత్తరోత్తరం బలీయం అనే న్యాయాన్ని పాటించినాడు. ముక్త పద గ్రష్టం పద్యానికి అదనపు అందం.
నూతజల పూరితంబులగు నూతులు నూరుటి కంటే శూన్రత
పుత్ర! ఒక బావి మేలు, మరి బావులు నూరిటికంటే నొక్క సక్రతు వది మేలు,
తత్ క్రతు శతంబున కంటే సుతుండు మేలు,
తత్సుత శతంబు కంటే కంటే నొక సూ నృత వాక్యము మేలు చూడగన్"
నూరు దిగుడు బావుల కంటే ఒక చేద బావి మేలు. ఎందుకు? అది జంతువుల వల్ల మనుషుల వల్ల కలుషితం కాకుండా పానయోగ్యంగా ఉంటుంది. నూరు బావులకంటే ఒక యజ్ఞం మేలు. ఎందుకు?
అది సమాజా హితం కోసం దేవతల ప్రీతికై చేసేది. నూరు యజ్ఞాల కంటే ఒక సంతానం మేలు. ఎందుకు? వృద్ధాప్యంలో తల్లిదండ్రుల రక్షణ పోషణ బాధ్యత వహిస్తారు కాబట్టి. నూరు మంది సంతానం కంటే ఒక సత్య వాక్యం మేలు. ఎందుకు? లోకం సత్య ధర్మాల మీదనే నిలుస్తున్నది. అవే మానవుని గొప్పతనానికి శాశ్వత సత్ కీర్తికి కారణాలు. ఇలా భావాన్ని తేట తేట మాటలతో తెలుగు తియ్యదనాన్ని కుప్ప పోసి అందంగా అందించారు-ఆదికవి.

కామెంట్‌లు