జీవనయానం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ముందుకు 
పయనం సాగాలోయ్
గమ్యము 
త్వరగా చేరాలోయ్

సక్రమమార్గము
పట్టాలోయ్
అడుగులువడివడి
వెయ్యాలోయ్

అందం
కంటికి కావాలోయ్
కవితలు
కమ్మగ వ్రాయాలోయ్

అన్నం
నోటికి కావాలోయ్
పొట్టను
పూర్తిగా నింపాలోయ్

తోడు
వంటికి కావాలోయ్
వయ్యారాలు
ఒలికించాలోయ్

ముచ్చటలు
మదికికావాలోయ్
హృదయం
పొంగిపోవాలోయ్

ప్రేమ
గుండెకు కావాలోయ్
బంధాలు
అల్లుకొని పోవాలోయ్

పనులు
చేతికికావాలోయ్
జేబులు
డబ్బుతోనిండాలోయ్

కాళ్ళకు
నడక కావాలోయ్
గమ్యం
తొందరగా చేరాలోయ్

రుచులు
నాలుకకు కావాలోయ్
మనసు
మురిసిపోవాలోయ్

జీవితానికి
గమ్యం యుండాలోయ్
సాధనకు
ప్రయత్నం చేయాలోయ్

పయనం
సాగాలోయ్
లక్ష్యం
అందుకోవాలోయ్

బండిచక్రాలు
కదలాలోయ్
కాలచక్రము
కదలాలోయ్


కామెంట్‌లు