భాష మాధుర్య పదాంశాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 మనం మాట్లాడే మాటకు బలం చేకూర్చే అంశాలు. పలుకు బళ్ళు సామెతలు, న్యాయాలు, పొడుపు కథలు ఇవన్నీ భాష మాధుర్యంలో భాగాలే.
అందవేసిన చేయి, అడవిగాచిన వెన్నెల, పప్పులో కాలు వేయడం, కప్పల తక్కెడ జీవితం, కారాలు మిరియాలు నూరటం, చెవి గిల్లటం వంటివి పలుకు బళ్ళు. ఇట్టి వి ఏ ఏ అర్దాలలో వాడేవాళ్ళు ఉదాహరణమైన వాక్యాలు నేర్చుకోవాలి. దానివల్ల రచనకు మెరుగు చేకూరుతుంది.
అయిపోయిన పెళ్ళికి మేడం ఎందుకు, కానీకి టెంకాయ ఇస్తారని కాశీకి వెళ్లినట్లు, కత్తిపోటు తప్పిన కలం పోటు తప్పదు, నిద్రించేవాని చేతి నిమ్మకాయ జారినట్లు, దంచినమ్మకు బొక్కిందే కూలి వంటివి సామెతలు. ఇవి ఉపన్యాస కళకు వన్నెతెస్తాయి. అచ్చ తెలుగుదనం ముచ్చటై నిలుస్తాయి.
మర్కట కిశోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం, అంధ పరంపరా న్యాయం, శాఖా చంక్రమణ న్యాయం వంటివి న్యాయాలు కన్నులకు గట్టు, గొంతు తడుపు, మోచేయి నాకించు, గోళ్లు గిల్లు వంటి జాతీయాలు,
ఆపోవు, రక్కును, విజయం చేయు శబ్దపల్లవాలు వ్యాసరచనకు శోభనిస్తాయి. మాటల్లోనే చురుకుదనాన్ని తెలుపుతాయి. పదకేళి, నుడి కట్టు వంటి పోటీలలో తరచూ పాల్గొంటూ ఉండాలి. నిఘంటువు పై అధికారం వస్తుంది. పద సంపద పెరుగుతుంది. పురాణ విజ్ఞానంపై పట్టు సాధించవచ్చు.
పొడుపు కథలు పిల్లల మీదకు పరీక్ష. వాటిని పరిష్కరించడంలో వాళ్ల బుద్ధి పదునెక్కుతుంది. సరైన సమాధానం లభించగానే పిల్లల కళ్ళల్లో వెలుగు తొంగి చూస్తుంది. విజయానందరేఖ విరబూస్తుంది.

కామెంట్‌లు