శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 
స్మశానం అనే శబ్దం శీ ధాతువు నుంచి వచ్చింది.దీని అర్థం పడుకోవటం నడుంవాల్చటం నిద్ర పోటు! ప్రాచీన కాలంలో శవాన్నిపాతేవారు.ఆర్యులవలన దహనకాండ వచ్చింది.పర్యావరణం కలుషితం కాదు.భూమికై డబ్బు చెల్లించి సమాధి కట్టనవసరంలేదు.
శ్రమణకుడు అంటే సాధువు అని.కొందరి అభిప్రాయం ప్రకారం సమానభావం చూపేవాడు.మోక్షంకోరేవాడు.శ్రమించటానికి వెనుకాడని వాడు.కానీ ఇప్పుడు శ్రమపడేవాడిని శ్రమణుడు అంటున్నారు.
శ్రావణ్ అంటే శ్రోత అని అర్థం.గురూపదేశం పొందిన శిష్యులు కూడా.బౌద్ధమతంలో ఈపదానికి విశిష్ట అర్ధం ఉంది.ఆయన ఇద్దరు శిష్యులు సారి పుత్త మొగ్గలాన్ నిమాత్రమేశ్రావక్ అనేవారు.కాలక్రమేణాహీనయాన బౌద్ధులని శ్రావకసాధువులు అన్నారు.జైన సన్యాసుల కు కూడా ఇదేపేరు స్థిరపడింది.
శ్రావస్థి ఒకప్పుడు ప్రసిద్ధ నగరం.సీతారాములకొడుకు లవుడు దీనిని పాలించాడు.ధర్మపురి అని కూడా పిలుస్తారు.బుద్ధుడు ఇక్కడ నివసించాడు.మహాకాంతార్ అనే మార్గం శ్రావస్తీ నుంచి ప్రతిష్ఠానపురందాకా ఉన్న ఆనాటి నేషనల్ హైవే

కామెంట్‌లు