బాలసరస్వతి "కళ"; -- యామిజాల జగదీశ్
 భరతనాట్యం నేడు పాశ్చాత్య దేశాలలో బాగా ప్రసిద్ధి చెందిందంటే అందుకు ముఖ్య కారకులు తంజావూర్ బాలసరస్వతి. 1950వ దశకంలో ఆమె ఈ కళను అక్కడి వారికి పరిచయం చేశారు.
ఈ కళారూప వ్యాప్తికోసం ఆమె దేశవిదేశాలలో అనేక వేదికలపై నాట్యప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా  ప్రసిద్ధ ఉత్సవాలలో ఆమె సోలో ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆమె నిర్వహించిన శిక్షణా తరగతులు,
వర్క్‌షాప్‌లు, ప్రత్యేకించి ప్రతిష్టాత్మకమైన వెస్లియన్ విశ్వవిద్యాలయానికి చెందినవారు, అనేక మంది అమెరికన్లు బాలసరస్వతికి వీరాభిమానులయ్యారు

టెడ్ షాన్ వారి జాకబ్స్ పిల్లో ఫెస్టివల్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు చెప్పలేనని ప్రశంసలొచ్చాయి. ఆమె ప్రదర్శన "ఒక ప్రత్యేకమైన అనుభవం" అని ఒకరంటే "ఆమె కళ సున్నితమైనదీ, అందమైనదీ‌, శాశ్వతమైనదీ, సరిహద్దులను చెరిపేసింది" అని మరొకరన్నారు.
 
బాలసరస్వతి తన జీవితమంతా ఈ కళకు అంకితం చేశారు. 
ఆమె ఓసారి మన జాతీయ గీతం "జనగణమన"కు   నోబెల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో నాట్యం చేసి సెభాషనిపించుకున్నారు. అప్పటికింకా అది జాతీయగీతం హోదా పొందలేదు.
సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన బాలసరస్వతి గొప్ప సంగీత విద్వాంసురాలు కూడా. మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి బిరుదు పొందిన ఏకైక భరతనాట్య నర్తకి ఆమెను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

కామెంట్‌లు