* కోరాడ మినీలు *

    @   నేను @
.             ***
నేను... నేను, అనుకుంటున్న
నేను... అసలు నేను కానని... 
అందరిలోనూ -  అన్నిటిలోనూ 
వున్న నేనే.... నేనని.... 
    తెలుసుకున్నాను !
ఇంక...భేదములు, వాదములు 
 ఖేదములకు తావెక్కడ.... !
   అన్నీ ఆమోదములే.... 
            మోదములే... !!
       ****** 
            @ నాది @
అసలు ఈ నేనే... నేను కానపుడు, ఇంక నాదనేదేముంటుంది... !
   మూన్నాళ్ళ ముచ్చటకై... 
  మజిలీకి వచ్చినవాడ్ని... 
ఎలా వచ్చానో... అలానే పోయేవాడ్ని !
వున్న మూన్నాళ్ళూ మాయలోపడి కొట్టుకుచావటమేమిటో... !!
        ******
         @  వృధా  @
               ***
హాయిగా సుఖానందాలను పొందటం మరచి...., 
 కోరి కష్టాలను కొని, తెచ్చుకుని 
కుమిలిపోతూ..., ఉత్కృష్ట మైన మానవజన్మను వృధాచేసుకోవటం... మూర్ఖత్వమే కదూ.... !
       ****-*
కామెంట్‌లు