ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా గంజాం భ్రమరాంబ నియామకం

 శ్రీశ్రీ కళావేదిక  మరియు ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 9,10 తేదీలలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో48 గంటలపాటు నిర్వహించే ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, ఉపాధ్యాయిని, శ్రీశ్రీ కళా వేదిక తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి గంజాం భ్రమరాంబ గారిని నియమిస్తూ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. గంజాం భ్రమరాంబ నియామకం తెలిసి పలువురు రచయితలు, ఉపాధ్యాయులు, కళాకారులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు