శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 సంస్కృతంలో ఒకపదానికి నానార్ధాలున్నాయి.పుత్రుడు అంటే నరకంనుంచి కాపాడేవాడు.ఆత్మజుడు అంటే ఆత్మ నించి ఉత్పన్నమయ్యేవాడు.నందనుడు అంటే ఆనందం కలిగించేవాడు.ఇవన్నీ కొడుకు అనే అర్ధాన్ని ఇస్తాయి.
రాగ్ అనే పదంకి మరాఠీలో క్రోధం అని అర్ధం. హిందీ లో మాత్రం ప్రేమప్రీతి .ఇందులోంచే అనురాగం వచ్చింది. రాగం అంటే సంగీతం లో పాడేవిధానం రాగాలు అని అర్ధం. వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నో రాగాల్లో ఉన్నాయి.
ఒకప్పుడు ప్రవీణ అనే శబ్దం కి అర్ధం  వీణవాయించేవారు అని. కానీ చతురుడు యోగ్యుడు అని అర్ధం. 
ఠాకుర్ అంటే భగవంతుడు అని అర్ధం. కానీ ఇప్పుడు రాజపుత్రక్షత్రియులను ఠాకుర్ అంటాం. బెంగాలీ లో ఠాకుర్ అంటే ఇంటి పెద్ద అనిఅర్ధం.ఠాకుర్ దాదా అని గౌరవంగా పిలుస్తారు. 
మనదేశంలోని పేర్లుకూడా దైవం కి సంబంధించినవే!బౌద్ధ జైన మతప్రభావంతో సిద్ధార్ధ  రాహుల్  ఋషభ్  జైనేంద్ర అనే పేర్లు వాడుకలో ఉన్నాయి. ముస్లిం ప్రభావంతో రాంగులామ్ రాం నెవాజ్ ఇక్బాల్  బహదూర్ సింహ్ అనే పేర్లు వాడుకలో ఉన్నాయి. ఆంగ్లేయపాలనలో బేబీ బంటీ లిల్లీ డాలి  అంటున్నారు. ఆర్యసమాజ ప్రభావంతో  వేదప్రకాశ్ వేదమిత్ర సత్యవ్రత అనేపేర్లు పెడుతున్నారు. 
బౌద్ధ విహారాలు ఎక్కువ ఉండటంవల్ల బీహార్ అన్నారు. 
ఇంకొంత మంది పిచ్చి పేర్లు పెడితే పిల్లలు బతుకు తారనే నమ్మకం తో పెంటయ్య యాకయ్య అనే పేర్లు పెడతారు. 🌷

కామెంట్‌లు
Unknown చెప్పారు…
బాగుంది.