వెన్నెలలో చంద్రుడిని చూపి కథలు
చెప్తావు కదమ్మా ఒక్కసారంటే ఒక్క మారు నాకు మా నాన్నని చూపమ్మా!
నేనేమీ తప్పు చేశానమ్మా కారణం చెప్పవా!
గట్టిగా అడుగుదామంటే నీ కళ్ళకొలనులో నీరు జూచి నేను నీరైపోతున్నానమ్మా !
అమ్మా !నిజం నీమీద వట్టు నేను తప్పేమి చేయలేదు నన్ను నమ్ము!
నీకు తెలుసు కదా అమ్మ చూడాలని ఉంది అంతే,.మహా గొప్ప పని పై వెడలె
నాన్న కదమ్మా! కానీ నేనొక చిన్ని బిడ్డడినీ
ఇక్కడ ఉన్నానని,గుర్తు చేయలేక పోయావా
నాపేరు కూడా తెలుసో లేదో పాపం కదా
రాహుల్ అని చెప్పమ్మా, నేను వెతకనా?
కానీ నిన్నేలా వదలను, నే వెడితె నీ కెలా
వద్దు లే నీకోసంఇక్కడేవుంటా.
నిన్నే నా నాన్నగ, నా అమ్మగా చూసుకుంటా ! ఇక మీదట అడుగ నమ్మా నమ్ము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి