సంస్కృతంలో తాలికా అంటే కరతాళధ్వని చప్పట్లు కొట్టడం!ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేము.అలాగే ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు.హిందీలో తాలికా అంటే తాళంచెవి సూచిక అని అర్థం.కుంజీ తాలీ అని హిందీలో పదప్రయోగం ఉంది. బెంగాలీ లో కూడా తాలికా అంటే సూచిక అనే అర్థం.
తంబాకు అంటే పొగాకు.టుబాకో అనే పదం వెస్ట్ ఇండీస్ మృతభాష తాయినో నించి వచ్చింది.దీని అర్ధం చిలుం అని.వెస్ట్ ఇండీస్ నుంచి స్పానిష్ అందులోంచి పోర్చుగీస్ లోకి దిగుమతి ఐంది.మనదేశంలోకి అడుగు పెట్టిన పోర్చ్ గీసులు దీన్నిఎంచక్కా మనకు అలవాటు చేశారు. ఇది మొదట దక్కన్ లో ఆపై ఉత్తర భారతదేశంలో వ్యాపించింది.అక్బర్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.నవాబ్ ఖాన్ ఆజం అక్బర్ నుంచి కలిసి రత్నాలు పొదిగిన చిలుం తోపాటు పొగాకు ని బహూకరించాడు. మక్కా మదీనా కి చెందిన వనస్పతి ఔషధీ మొక్క అని బాగా తైరు కొట్టాడు. పాపం అక్బర్ కి దానిపై ఇష్టం కలిగినా రాజవైద్యుడి సలహాతో పొగాకు మానేశాడు.మరాఠీలో దీన్ని తంబాఖూ అంటారు.తాయినో భాషా నించి వచ్చిన ఇది కాన్సర్ కి ఊపిరి తిత్తుల జబ్బుకి కాణాచి!
తృష్ణ అంటే అర్థం దాహం అని.కాని ఇప్పుడు లోభం ఏదైనా వస్తువుని వశపర్చుకోవాలనే ఆశ అనే అర్థంలో వాడుతున్నాం.తీవ్రమైన కోరిక అనేది నేటి అర్థం.దప్పిక దాహం మాయమైనాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి