తొట్టంబేడు :
పాఠశాల దశ నుండే ప్రతి విద్యార్థి తెలుసుకోవాలనే కుతూహలం,జిజ్ఞాస
కలిగి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల పెన్నలపాడు ప్రధానోపాధ్యాయులు
కయ్యూరు బాలసుబ్రమణ్యం అన్నారు.
సర్.సి.వి.రామన్ 'రామన్ ఎఫెక్ట్' కను
గొన్న సందర్భంగా పాఠశాల లో జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ఘనంగా విద్యార్థులు జరిపారు.అట్ట ముక్కలతో
బొమ్మలుతయారు చేసి,చిత్రలేఖనం వేసి ప్రదర్శించారు.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి