తొలిగ మనిషన్నవాడు
తల్లిబంధముతో పుడుతున్నడూ
తరువాత తెలుసుకొని
తండ్రిబంధాన్ని పెంచుకుంటున్నడూ
అన్నాదమ్ముళ్ళతోడ
అనురాగబంధాలు ఏర్పరచుకుంటున్నడూ
అక్కచెల్లెళ్ళతోడ
ఆప్యాయతలబంధాలు కలుపుకుంటున్నడూ
చదువుసంధ్యలపుడు
స్నేహబంధాలలో పడుతున్నడూ
పలు ప్రాణమిత్రులను
ప్రోగు చేసుకుంటున్నడూ
పెళ్ళయిన పిమ్మట
సంతానాన్ని కంటున్నడూ
పిల్లల బంధంలోపడి
మమకారంలో మునిగిపోతున్నడూ
భార్యాపిల్లలకోసం
డబ్బు సంపాదిస్తున్నాడు
ధనబంధంలోపడి
కష్టాలు తెచ్చుకుంటున్నడూ
అనుబంధాలతో
అనేకపాట్లు పడుతున్నడూ
అయినా చచ్చేదాకా
బంధాలను వీడకుంటున్నడూ
మనిషికి
మనసే బంధాలకారణి
మనసుకు
మరణమే బంధవినాశిని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి