ప్రపంచ ఆలోచనా దినోత్సవంలో వావిలాల స్కౌట్లను అభినందించిన కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి


  డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో తేది: 22-02-2023 న స్కౌట్ ఉద్యమ వ్యవస్థాపకుడు లార్డ్ బేడన్ పావెల్ జయంతి సందర్భంగా "ప్రపంచ ఆలోచనా దినోత్సవ వేడుకలు" ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో వావిలాల,గర్షకుర్తి,రాచపల్లి,రామంచ,ఎలగందల్,రుద్రారం,పారమిత పాఠశాలల నుండి నలబై మంది స్కౌట్లు,గైడ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సిహెచ్ వి ఎస్ జనార్దనరావు హాజరయ్యారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా విద్యాశాఖాధికారి గారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు నిర్వహించడం వలన విద్యార్థుల్లో దేశభక్తి,దైవభక్తి, క్రమశిక్షణ, నాయకత్వం,ఉత్తమ పౌరసత్వ లక్షణాలు మొదలైనవి పెంపొందించబడుతాయని,తన హయాంలో జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ యూనిట్లు ఏర్పాటు చేయడానికి, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని తెలియజేశారు.గత మాసం జాతీయ జంబోరీ-రాజస్థాన్ లో పాల్గొని వివిధ పతకాలు,అవార్డులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్లు ఐలాపురం శ్రీచరణ్,బొడ్డుపల్లి రాకేష్,చేపూరి విష్ణువర్ధన్ లకు జిల్లా విద్యాశాఖాధికారి గారు ధ్రువపత్రాలు అందజేశారు.వీరిని జిల్లా కార్యదర్శి శ్రీ కంకణాల రాంరెడ్డి, జిల్లా ట్రైనింగ్ కమీషనర్ శ్రీ షరీఫ్ అహ్మద్, జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ శ్రీ అడిగొప్పుల సదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కెపి నరేందర్ రావు,ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం