అవ్వ సలహా! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరాజు సామాన్య దుస్తులలో వేటకి వెళ్లాడు. ఆకలిదంచేస్తోంది.దూరం గా ఓగూడెంకనపడింది. అవ్వ జొన్న రొట్టె ఊచబియ్యం బువ్వ వండి ఉల్లిపాయ చింతపండువేసి ఉడకపెడుతోంది.ఆఘుమఘుమలకి రాజు ఆకలి రెట్టింపు ఐంది. "అవ్వా!ఆకలిగా ఉంది" అన్నాడు. ఇంతలో ఆమె మనవడుకూడా వచ్చాడు.ఇద్దరికీ మోదుగ ఆకులవిస్తరిలో అన్నం చారు పోస్తోంది.మనవడు అన్నం మధ్యలో గుంటచేస్తే అందులో పులుసు పోసింది. రాజు తో అంది"బాబూ! నామనవడు రాజుగారి భటుడు.సైన్యం రాజుకి బలం.కోటచుట్టూ బలమైన గోడలాగా అన్నంమధ్యలో గుంటచెయ్యి.అందులో పులుసు పోస్తాను.లేదంటే పులుసు అన్నంపై పోస్తే అది నలువైపులా పాకి నేల పాలవుతుంది."అంది.మనవడు అన్నాడు "మేము కోటచుట్టూ ఇలా కాపలా కాస్తాం.గుంట కోట!" అన్నాడు. ఇప్పటికీ పెద్దలు విస్తరి లో అన్నం మధ్యలో గుంటలాచేసి పులుసు చారు పోశాక కొద్ది కొద్దిగా అన్నం అందులో కలిపి తింటారు. 🌺
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం