విచ్చుకున్న పువ్వుల మల్లె
రెక్కలు విప్పే ఊహలు....
జ్ఞాపకాల పరిమళంలో
పరవశించిన తలపులు
మౌన గీతం పాడే మనసుకు
ఉదయరాగపు ఉత్సాహం
కరుగుతున్న కాలమైనా
వెలుగుతున్న ఉదయం
వెతలన్నీ ఓడిపోయి
కతలన్నీ మార్చేసే క్షణాలు
వడలిపోని ఆశతోటి
నడక సాగే గమనము
అలసిపోనివ్వని కర్తవ్యం
ఆగిపోనివ్వని అవసరం
ఉరుకుల పరుగులే జీవనం
ఊపిరి తిప్పుకోనివ్వని పయనం
హృదయంలో నీ గురించి
కొంచెం స్థలం ఉంచుకో....
తిరిగి చూసుకుంటే అవే
మిగిలే మధురానుభూతులు
వేకువ పొద్దులూ
వెన్నెలరాత్రులూ
ఉన్నాయి ఆహ్లాదానికి
నీకు నీవు నచ్చెట్టు
గడిపే సమయాలు
కోటికోటి పరిమళాలు
వెదజల్లే పువ్వులు
ఆహ్లాదమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి