హాయిగా బ్రతకండి!!;- సునీతా -ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
చెట్టు పుట్టకు
పుట్టుక గట్టుక స్పృహ లేదు
జనన మరణాలు
కారణాలు కావు
జీవ పరిణామక్రమాలు!
జీవ పరిణామ చక్రాలు!!

ఇంకా బ్రతకాలి అని
ఆశపడటం
ఆత్మహత్య చేసుకోవాలని
అనుకోటం
రెండు సరి అయినవి కావు!!?
ఇక్కడే
మనిషి ఆలోచన చనిపోయింది
మనిషి ఓడిపోయింది!!!?

మనిషి మనసును కాదు
వయసును మాత్రమే ప్రేమించాలి!!

ఆలోచనను
అధిగమించాలి!!

భౌతికతతో
ఒదిగిపోవాలి!!!

జీవించాలనుకుంటే
జీవనశైలిని
ఆలోచన సరళిని సరి చేయాలి!!?

నీ శరీరం గురించి
నీవు తెలుసుకోవాలి
నీ ఆరోగ్యం గురించి
నీకు తెలిసి ఉండాలి!!

నీ చుట్టూ ఉన్న
భౌతిక ప్రపంచం
నీవు వాడుతున్న
పరికరాలు పనిముట్లు
ఎట్లా పనిచేస్తున్నాయో
తెలిసి ఉండాలి!!!!

వ్యాపారం కన్నా
ఉపకరణం ముఖ్యం!!?
ప్రతిదానికి కారణం ముఖ్యం
అని తెలిసి ఉండాలి!!?

మరణం ముఖ్యం కాదు
ఆలోచన ముఖ్యం కాదు
మనుగడ ముఖ్యం
మనిషి ముఖ్యం!!!?
మనిషే లేకుండా పోతే
ఆలోచనతో ఏం చేస్తాం!!!?

ఆలోచనలను వదిలేయండి!
మనసును మర్చిపోండి!!
హాయిగా బ్రతకండి
భద్రత కోసం భయపడకండి!!!

కామెంట్‌లు