ఆనాటి 'ఉదయం' దినపత్రిక వైతాళికులనదగ్గ వారిలో దివంగత దాట్ల నారాయణ మూర్తిరాజు గారు కూడా ఉంటారు. 'ఉదయం' ఆదివారం అనుబంధాన్ని సరికొత్త శీర్షికలతో ఆత్మీయంగా, గొప్పగా సక్సెస్ చేయడంలో ఆయన కృషి అమోఘం. పోస్ట్ మ్యాన్ పెద్ద గోనెసంచి నిండా పాఠకుల ఉత్తరాలను సెక్షన్ లోకి తెచ్చివ్వడం నాకు బాగా గుర్తు. అదొక స్వర్ణయుగం అనడానికి ఇదొక ఉదాహరణ. తర్వాత నాగేంద్ర దేవ్, దేవిప్రియ గార్ల ఆధ్వర్యంలో అనేక అద్భుతాలు జరిగాయి. దాట్ల గారికంటే ముందు పతంజలి గారి నేతృత్వంలో శాతవాహన (మహమ్మద్ గౌస్) గారు తనదైన శైలిలో ఆదివారం అనుబంధాన్ని ఎంతో చక్కగా, వినూత్నంగా తీర్చిదిద్దారు. మొదట్నుంచీ వీరందరి వద్ద పనిచేసే అపూర్వ అవకాశం నాకు పతంజలి గారివల్ల లభించడం నిజంగా నా అదృష్టం. దినపత్రికలలోని ఆదివారం అనుబంధాల వ్యాస రచనపై పబ్లిక్ రిలేషన్స్ డిప్లొమా కోసం నేను ఆనాడు థీసిస్ సమరించాను. ఇలా చెప్పుకుంటూ పోతే, అప్పటి జ్ఞాపకాలు ఎన్నో, ఎన్నెన్నో.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
(ఫోటో: దివంగత దేవిప్రియ గారితో ఆనాటి ఉదయం 'ఆదివారం అనుబంధం', వీక్లీ జర్నలిస్టులం, ఎడమ నుంచి కుడికి వరుసగా:
ఉదయ్ (సబ్ ఎడిటర్), నాలేశ్వరం శంకరం (కవి), నేను (దోర్బల బాలశేఖరశర్మ, సబ్ ఎడిటర్), వి.కె.అశోక్ (ఆర్టిస్ట్), దేవిప్రియ (ఎడిటర్), నాగేంద్ర దేవ్ (చీఫ్ సబ్ ఎడిటర్), జగన్ (ఆర్టిస్ట్), జొన్నలగడ్డ శ్యామల (సబ్ ఎడిటర్), దేవిప్రియ గారి అమ్మాయి).
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి